చరిత్ర మరిచిన పర్వం...
అధికారం ఇవ్వని ప్రస్థానం...
గుర్తింపు లేని విప్లవం...
ఒంటరిగా మిగిలిన సైన్యం...
చరిత్ర పుటలు నిన్ను మరువుండొచ్చు...
స్వార్థపు రాజకీయాలు నిన్ను చంపుండొచ్చు...
అధికార దాహం నిన్ను ఆపుండొచ్చు...
స్వాతంత్ర్యానికి మంత్రం నువ్వు...
గణతంత్రానికి యంత్రం నువ్వు...
భరతజాతికి ముద్దుబిడ్డవు నువ్వు...
నేటి యువతరానికి శక్తివి నువ్వు...
భారతీయుల రక్త నాళాల్లో ప్రవహించే ప్రతి రక్తపు బొట్టు నీకు దాస్యం చేస్తోంది...
స్వదేశీయుల శ్వాస నాళాల్లో ప్రవహించే ప్రాణవాయువు నీకు సాక్ష్యంగా నిలిచింది...
వేదం గానం లాస్యం ప్రాణం నీ చరితం...
అమరం అఖండం అద్భుతం అజరామరం నీ అస్థిత్వం...