Photo by Chris LeBoutillier on Unsplash

డబ్బు అవసరం భూమికి ఎంత ఉందో తెలియదు కానీ దాని అవసరం కోసం ప్రయత్నించే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి , దాని మోజులో పడి భూమి ని సర్వ నాశనం చేస్తున్నాడు,

ఎందుకు

ఎందుకు ,, మనిషి తను ఉంటున్న నేలను కావాలనే నాశనం చేసుకుంటున్నారు !! , నిజంగానే కావాలనీ నాశనం చేసుకుంటున్నాడా !!

చెప్పాలంటే స్వతహాగా ఎవ్వరూ తమ ఉంటున్న ఇంటిని కావాలని అంతం కావాలని కోరుకోరు ,, ఇక్కడ మనిషికి తెలిసింది ఏమిటంటే ఈ భూమి పై బతకాలంటే ఆహారం , నీరు ,గాలి , నిప్పు , ఇల్లు ,లాంటివి కావాలి ,,

వీటికోసం అని మానవుడు భూమిని నాశనం ఎలా చేస్తున్నాడని సందేహం రావచ్చు , ఒకప్పుడు భూమి పై మానవ జాతి ఆవిర్భవించినప్పటి దానితో పాటుగా చాలా రకాల జాతులు కూడా ఆవిర్భవించాయి , అన్నిటి ఉద్దేశ్యం ఇక్కడ ఒకటే , బతకడం ,, కాబట్టి బతకడానికి వారికి కొన్ని అవసరాలు ఏర్పడ్డాయి అవే నీరు ఆవాసం , వాటి అవసరం తెలుసుకున్న కొన్ని మానవ జాతులు వాటికి రుసుము రూపంలో వెలకట్టడం ప్రారంభించాయి , అక్కడ మొదలైంది డబ్బు అనే శాసనానికి కి ఒక రూపం ,

తరువాత కాలానుసారంగా మానవుడు నగదును తన పరువుకి , తహత్తుకి ప్రతీకిగా వాడుకోవడం మొదలు పెట్టాడు , దాని వల్ల తనకంటూ ఒక గౌరవం , మర్యాద పెద్దరికం దొరుకుతుందని , దానికోసం వీలైనంత భూమి నీ స్వాధీనం చేసుకోవడం అనే అరాచకత్వానికి కూడా నాంది పలకడం అప్పుడే ప్రారంభమైంది.

దీనివల్ల ఏమైంది, ఉండడానికి చోటు లేని వాళ్ళ సంఖ్య ఒకరి హోదా వల్ల దూరమైంది,

పోనీ ఆ భూమిని అతను మంచికోసం వాడుతున్నాడా

కచ్చితంగా వాడుతున్నాడు తన లాభం కోసం ఆ భూమిలో ఫ్యాక్టరీ లు అంటూ రసాయనాలు నీటిలో, వాయువుని నింగిలో కలుపుతూ తను సుఖానికనుకుంటూ తన భవిష్యత్తుని తానే మృత్యువు వైపుకి తీసుకెళ్తున్నారు,,

ఇలా ఎందుకు చెయ్యాలి అని ఎవరికైనా అనిపిస్తుందా , అరే నిజమే కదా ఇలా ఫ్యాక్టరీ లోని వాయువుని వదలడం రసాయనాలు భూమి లోకి పంపడం వల్ల మనకే కదా నష్టం అని మనందరికీ తెలుసు అయినా , ఎం చెయ్యలేం ఎందుకంటే అవసరం మన అవసరమే డబ్బుకి హోదాని కల్పిస్తుంది ,,

అసలెందుకు ఈ అవసరం 10000 సంత్సరాల క్రితం మనిషి ఎలా భతికాడో అలా భతకలేమా అంటే , అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు కాలాన్ని భట్టి మారాలి అంటారు , మారాలి అంటే ముందు తరాలకి ఒక భవిష్యత్తుని ఇవ్వటమే గానీ ఆ భవిష్యత్తుని డబ్బు పేరుతో నాశనం చేయడం కాదు కదా ,, ఇప్పుడు బతకడం అంటే డబ్బుతో కూడిన వ్యాపారమే

డబ్బు అవసరమే ,, కానీ అది మనం ఆరోగ్యంగా బతకడానికి ఇంకొకరినీ అయిస్సు తో వుంచడానికి,,

ఇప్పుడు మనం డబ్బు కోసం చేసే కొన్ని పనుల వల్ల భూమి నాశనం ఎలా అవుతుందో చూద్దాం,

అందులో మొదటిది వ్యవసాయం,,

వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైన మనుగుడ ప్రక్రియ , ఈ ప్రక్రియను ఎక్కువ సంపద పేరుతో రసాయనాలు అధికంగా వాడేయడం వలన తక్కువ వ్యవధిలో పంట చేతికొచ్చి లాభం చూపిస్తుంది ఈ నేపథ్యంలో కొందరు కలితీ రసాయనాలను తయారు చేయడం వల్ల అవి వాడే భూమిలో సారం తగ్గిపోయి ఆఖరికి ఆ భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోతుంది,,

ఇంకొకటి నిత్యావసర వస్తువులు,,

నిత్యావసర వస్తువులు అంటే మనం ఉపయోగించే చిన్న చిన్న వస్తువులు బెడ్ లు, ప్లాస్టిక్ కుర్చీలు ,, ఫోన్లు ఫోన్ కి వాడే ఎలక్ట్రికల్ వస్తువులు ,టీవీలు , ఇలాంటివి అన్న మాట వీటిని తయారు చేసే ఫ్యాక్టరీలు చాలా మటుకు నీటి పారుదల ఉన్న స్తలాలలోనే నిర్మిస్తూ ఉంటారు, ఎందుకంటే మనం యే చిన్న వస్తువు చేసినా అందులోని వ్యర్దం ఎంతో కొంత వుంటుంది అలాంటిది కొన్ని వేల వస్తువులను తయారు చేసే దానిలో ఉండే వ్యర్థాలను పారేయాలంటే ఉండే ఒకేఒక మార్గం ప్రవహించే నీరు కాబట్టి, ఇలా వ్యర్థాలను నీటిలో పడేయటం వల్ల నీరు కలుషితం అవ్వడం, కలుషిత మైన నీరుని తాగటానికి జనాలు ముందుకు రారు , అలా నీటికి కొరత రావడం మొదలవుతుంది, దీనిని ఆసరా చేసుకొని ఇంకొంతమంది వ్యాపారవేత్తలు ఉన్న మంచి నీటికి పేటెంట్ రైట్స్ తీసుకొని వాటికి రకరకాల పేర్లు పెత్తి అమ్ముకుంటున్నారు,, ఇలా జరగడం వల్ల నీరుకి అదనంగా కొంత డబ్బును చెల్లించే స్థాయికి వెళ్ళడం ప్రస్తుతం జరగడం చూస్తున్నాం,

అలాగే ఆ ఫ్యాక్టరీ లోని మండే పొగను వాయువు రూపంలో గాల్లోకి వదలడం వల్ల గాలిలోని నాణ్యత తగ్గిపోయి విపరీతమైన గాలి కొరత ఏర్పడటం వల్ల ఇప్పుడు ఆ గాలిని కూడా కొనే పరిస్థితికి వచ్చాం,చాలా ప్రాంతాలలో ఇప్పటికీ కొందరు ఆక్సిజన్ మాస్క్ తో తిరుగుతుంటారు,, అలాగే ఆ వాయువు వల్ల ఉష్ణోగ్రత తాకిడి స్థిరత్వం కోల్పోయి అధికంగా ఎండలు వేడి గాలులు రావడం అధిక సంఖ్యలో ప్రజలు మరణించడం జరుగుతూ అలాగే ఆ ఉష్ణోగ్రత మార్పుల వల్ల వర్షాలు అధికంగా కురవడం,,కురిసే నీటిని డామ్స్ లలో ఉంచలేక కబ్జా లు చేసిన చెరువుల వల్ల వర్షపు వరద నీరు జనవాసాల్లోకి వచ్చి అధిక సంఖ్యలో ప్రణ నష్టానికి ఆస్తి నష్టానికి దారితీస్తుంది. ఇదంతా ఎందుకు ఒకరిపై ఒకరికి ఆధిపత్యం కోసం గా , దానివల్ల ఒరిగేదేమిటి, నాలుగు గజాల భూమి కోసం ఒక ఖండాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తే దాని వల్ల వచ్చేది ఏంటి, పచ్చగా ఉండే ప్రదేశం ఒక్క చిన్న మొక్క కూడా పెరగలేని ఎడారి లా మారిపోతుంది,

పైన చెప్పినవన్నీ మనిషి బతకడానికి అవసరమైనవే వాటిని పొందటానికి మనిషి చూపే ఆశ వలన వాటిని తయారు చేసే వాళ్ళు డబ్బు మోజులో పడి అధికమొత్తంలో మనకు దొరికే రిసోర్సెస్ నీ వాడేయడం మనకి ఉచితంగా లభించే పంచభూతాలను తిరిగి అధిక ధరలకు కొనే స్థాయికి తెచ్చుకున్నాం, ఇలానే అయితే ఈ భూమి ఆ భూమిపై ఉండే ప్రాణం బతకడం చాలా కష్టం ,,

భూమితో పోలిస్తే డబ్బు చాలా చిన్నది , అందుకే భూమికి అంత విలువ.

.    .    .

Discus