ప్రస్తుత సమాజం లో అవసరానికి, ఆసరా కి మాట్లాడే వాళ్ళే తప్ప మనసు విప్పి మాట్లాడే మనుషులు తక్కువ. ఎందుకంటే కేవలం మనషుల మనసులను తట్టి మాట్లాడే మనుషులు పుస్తకాలలో ఉండే కథలలో, పాట లో సాహిత్యం లో మాత్రమే ఉంటారు.
అలాంటి పుస్తకాలని, పాటలని రచించేది మాత్రం ఒక మనిషే, వాళ్లనే మనం రచయితలు అని పిలుస్తాం. అలాంటి పుస్తకాలని, రచయితలని, నాకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి, నా పరోక్ష గురువు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు
కేవలం పరీక్ష లో వచ్చే మార్క్ ల కోసం చదివే పుస్తకాలే కాకుండా, జీవితంలో వచ్చే మార్పుల కోసం చదవాల్సిన పుస్తకాల గురించి తెలియయజేసిన సినిమా పండితుడు. ఆయన రచించిన చిత్రలలో, చిరునవ్వుతో చిత్రం లో రచించిన మాటల్లో చాలామంది ఓదార్చే వారు కనపడగానే వాళ్ళ బాధ ని చెప్పుకుంటారు కానీ వేణు లాంటి కొంతమంది మాత్రమే ఒంటరిగా బాధ పడతారు. అంటూ కథా నాయకుడు యొక్క వ్యక్తితవాన్ని తెలియజెస్తారు. ప్రస్తుతం చాలా మంది వాళ్ళ బాధని ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు అర్ధం చేసుకుంటారు అంటూ ఏడుస్తూ, ఆలోచిస్తూ, వాళ్ళ జీవితాన్ని పాడు చేస్కుంటూ ఉంటారు.
వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఇక్కడ మన బాధ వినేంత ఓపిక, మనల్ని పట్టించుకునేంత తీరిక ఎవరికీ లేదు. మనకి మనమే ఆ బాధ నుంచి బయట పడాలి గాని ఎవరో మన కన్నీళ్లు తుడుస్తారు అని ఎదురు చూడకూడదు. అసలు మన బాధ బయటికి చెప్పి, మనతో ఉన్న వాళ్ళని బాధ పెట్టుకుండా ఒంటరి గా బాధ పడటం, ఆ బాధ నుంచి బయటికి రావడం చాలా మంచిది , అని త్రివిక్రమ్ గారు రాసిన మాట ద్వారా మనం అర్ధం చేస్కోవచ్చు. ఆయన ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఎన్నో రాశారు. నేటి యువతకు కొన్ని తెలుగు మాటలు, సాహిత్య పుస్తకాల విలువలు తెలియయడానికి కారణం అయినా వ్యక్తులలో ఈయన కూడ ఒకరు.
ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఆదర్శంగా ఉంటారు, ప్రభావితం చేస్తుంటారు. నాకు వ్యక్తిగతంగా, సాహిత్యం మీద శ్రద్ద రావాడానికి కారణం రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయన చెప్పిన పుస్తకాలే కాకుండా నేను ఇతర రచయితల పుస్తకాలు చదివిన తరువాత నన్ను ప్రభావితం చేసిన రచయిత్రి - రంగ నాయకమ్మ గారు.
ఒక రచయిత ఎంత ప్రభావం చూపగలరో తెలీదు గాని, వారి మాటలు, వారి రచనలు, అందులోని పాత్రలు మనతో మాట్లాడతాయి, మనల్ని ప్రశ్నిస్తాయ్, మనకి సమాధానాన్ని ఇస్తాయ్, మనతో, మనలో ఉంటాయి. మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. నా మాటల్లో సాహిత్యం అనేది, ఖచ్చితంగా. గెలుపు ఇచ్చే బలహీనతల నుంచి, ఓటిమి ఇచ్చే వ్యసనాల నుంచి కాపాడతాయి. అనేది నా నమ్మకం.