ఆర్ట్:

మన లోకంలో చాల కళలు వున్నాయి.ఒక్కో కళకి ఒక్కో రకమైన విలువ వుంటుంది.మన ప్రపంచంలో అన్నిటికన్నా ముందు పుటిన కళ చిత్రకళా. దానికి చాల గొప్ప స్థానం వుంది ఈ సమాజంలో. ఆ తరువాత మనిషికి మాటలు వచ్చాయి ఆ మాటలను చాల చక్కగా కుర్చీ పేర్చి ముత్యాల వానలాగా చిలకరించి రాసాడు కవితలని.కవితల గొప్పతనం తెలుసుకోవడం మనకు కూడా చాల గొప్పతనం తెస్తుంది.అలాంటి కవితలు ఎలా రాయాలి .ఎం చేస్తే మనం కూడా కవితలు రాయవచ్చు అన్ని తెలుసుకుందాం .కవితలు రచనలు అని వేరుగా వున్నాయి .కవితలు మనుషులకి వారి బాధలను మరిపించేదిలా ఉంటాయి మల్లి వారిలో భావాలూ తెలిపేవిలా కూడా ఉంటాయి.కవితలు చదవటాని వాటిని అర్ధం చేసుకోవటానికి కూడా మనకు ఓ అరహతా మరియు మనస్సు ఉండాలి . కవితలు రాయడం ఓ కల .మరి కవితలకు రచనలకి మధ్య బేధం ఏంటో తెలుసుకుందాం . వాటిని ఎలా రాయాలి అని తెలుసుకుందాం... 

కవితలు (లేదా ) రచనలు రాయడం ఎలా :

కవితలు,రచనలు రెండు రకాలు. కవితలు రెండు మాటలు సమూహం.కవితలలో మాటలు లయబద్దంగా ఉంటాయి.కవితలు చాలా విధాలుగా రాయవచ్చు.కవితలు ఒక అంశం గురించి చాలా క్లుప్తంగా రాయాలి.కవితలో చాలా భావాలు కంటికి కనిపిస్తాయి.కవితలలో కొన్ని రకాలుగా ఉంటాయి.కవితలలో కొన్ని కవితలు చమత్కారంగా ఉంటాయి మరి కొన్ని ఉత్సహంగా మరి కొన్ని ఉతేజాన్నికలిగించేదిలా ఉంటాయి. కవితలు రాయడం వల్ల చిన్నగా పాటలు రాయడం కూడా అలవాటు అవుతుంది. కవితలు మనలోని ఆలోచనలు స్పష్టంగా తెలియజేస్తాయి. కవితలు వల్ల మనం సమాజానికి కొంత సందేశం ఇవ్వగలం. కవితలు రాయడం కష్టం కాదు. ఇష్టంగా రాస్తే చాలా సులభంగా, చదవటానికి చాలా అందంగా,ఆనందంగా కూడా ఉంటాయి.

కథకు శక్తీ సంఘర్షణ.సంఘర్షణకి ఉనికి సమస్య . సమస్యకు ప్రాణం వ్వక్తి. మానవ జేవీవమే సమస్యావలయం ; ప్రతి సమస్యకు ఒక కథ రాయవచ్చు సమస్యలున్నపుడే సంగం చైతన్యంతో ఉంటుంది. కథ ప్రక్రియలో అతిసామాన్య సమస్య నుండి అసామాన్య జీవితసత్యాలను వెతికి తేగల రచయితలే అసలయిన స్రష్ట .

ఒక చిన్న సామాన్య సంఘటనను కళాత్మకమైన విలువలతో కధగా చిత్రీకరించడమే ఉత్తమ రచయిత.

నవల కంటే కథ రాయడం చాలా కష్టం.దానికి చాలా పరిధులు,పరిమితులు ఉంటాయి. ఏ విషయం ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నదొక కళ. ఈ కళ అందరికి సులభ సాధ్యం కాదు రచయిత వేక్తిగతమైన ఈర్శసూయలకు అతీతంగా వుండాలి. తాను ఉద్వేగంతో తపన పడితే చాలదు; భావాలలో, ఆలోచనలలో తార్కిత లక్షణముండాలి. శాస్త్రీయ దృక్పధం తొణికిస లాడాలి.యదార్ధాలను ప్రతిపాదించాలి కాని పలాయన వాదానికి ప్రతినిధ్యమివ్వరాదు. రచయితకు కేవలం భాషా, భావం,తర్కం మాత్రమే చాలవు.

ఉద్వేగం,స్పందన ,భావనపటిమ కూడా వుండాలి. మనస్సుతో తదాత్మయం చెందిన అనుభూతిని అందించేలా ఉండాలి సాహిత్యం. అది ఉన్నత సాహిత్యమైతే పాఠకుడి మనస్సులో మేధతో పరిపూర్ణుడు.పాఠకుడు లేకున్నా సాహిత్యము తన విలువను పోగొట్టుకోదు. ఏ ఒక్కడు చదివి ప్రభావితుడైనా రచన సార్ధకమైనట్లై. ఆ ఒక్కడు మరోక్కడికి మార్గదర్శకం అవుతాడు.కధ (లేదా) రచనలో భావనా సంపద ముఖ్యం. రచయిత వ్యాపారదృష్టి,కీర్తిదాహం విడిచి చిత్తశుద్ధితో సామజిక ప్రయెజనాన్ని ఆశించి రాసేదే నిజమైన సాహిత్యం. రచనల్లో రాశి పెరిగినంతగా వాసి పెరగలేనదే వాదనను త్రోసి రాజనగగాలి. తరం మార్పుతోపాటు పాత ఆచారాలు,సంప్రదాయాలు మార్చి ఆధునికతను,సామాజిక స్పృహను పొందుపరచాలి సాహిత్యంలో ప్రజలు వివిధ వర్గంలో అనేక తెగలలో వుంటున్నారు.కానీ అందరికి అవసరమైనది తమ వేక్తికరణ.

Source: Bruno /Germany from Pixabay 

దానికి అంగాంగాలు ఉపాంగాలు ఉంటాయి.స్థాయిబేధాలుంటాయి. ఒకరికి ఆకలి తీరటం ప్రాధమిక అవసరమైతే, మరొకరికి భావప్రకటనా స్వేచ్ఛ అమూల్యం. అది వారి వారి పరిస్థితినిబట్టి,పరిణతినిబట్టి వుంటుంది. అంత మాత్రాన ఆహారము అక్కరలేదని కాదు;ఆహరం కోసం ఆరాటం.సత్యాన్వేషణ,స్వేచ్చపిపాస మీటిమధ్య వైరుధ్యం అలాంటి వైరుధ్యం వున్నదని భావించడం యాంత్రికదృష్టి.మానవుని ప్రత్యకతను గమనించలేనిచో దృష్టిదోషము.

రచనలలో వాస్తవికత వుండాలి అన్నపుడు ఈ కథలలోని వాస్తవాలను చదివి హర్షించగలము పైకి చిరునవ్వులు చిందుస్తున్నా, లో లో మధించే ఆత్మఘోషతో అల్లాడుతున్న నారిలోకపు విషాదగాధలు

వాస్తవాలు కావా? ఆ గాధలకు పరిష్కృతి లేదా ? సామాజిక వ్యవస్ధాపరిణామాన్ని గాని , ఈనాటి ఈ కుళ్ళిన వ్యవస్థని తీవ్రంగా గ్రహిస్తే మాత్రంచాలదు. పాత్రల్ని తిరుగుబాటు చేయించి నూతనవ్యవస్థా నిర్మాణానికి దోహదం చేయాలి రచయిత.భావ విప్లవంగా చిత్రించగలగాలి పదునైన పదజాలంతో రచయిత .

ఇది కధలు లేదా రచనలలో ఉన్నశక్తి ,మాయ ,గొప్పతనం.కధలు గొప్పగా ఉండాలంటే గొప్పగా పదలు అమరిస్తే చాలదు మన కధలో నేటి సంఘటనలు,సంప్రదాయాలు,భావాలూ స్పష్టంగా తొణికిసలాడాలి.అప్పుడే మన కధకు ప్రాణం వస్తుంది.

పాయింట్స్ టు నోట్:

  • కధకి లేదా కవితకి ఓ సంఘటన కావాలి .
  • కధలో కానీ కవితకిగాని సంఘటనకు సంబంధించిన కొన్ని నిజ మరియు వాస్తవిక విషయాలు అంతే పాయింట్స్ సమకూర్చుకోవాలి .
  • కథకైతే సంఘటనకి సంబంధించి కొన్ని పాత్రలను మనం పరిచయం చేయాలి .(అన్ని పాత్రలు ఒక్కసారిగా పరిచయం చేయకూడదు కధలో అవసరానికి తగ్గట్టు మనం పరిచయం చేయాలి )
  • పాత్రల స్వభావము మనం పరిచయం చేయాలి .
  • మన కధా ముఖ్య పాత్రలకు ప్రాణం పోసేదిలా వుండాలి .
  • కధలో ప్రతి సంఘటన దాని తరువాతి సంఘటనను ముడివేసిదిలా వుండాలి.
  • మన కధలో ముఖ్య పాత్రలకు ఎ ప్రాధాన్యత ఇవ్వాలి .అలాగే చివరి వరకు వాటికి అలాగే ప్రాణం పోయాలిప్పుడు.
  • మనం సృష్టించిన ప్రతి చిన్న పాత్రను మనం సరిగ్గా ముగింపు ఇవ్వాలి.
  • పాత్రలకు పేరులు ఇవ్వాలి .మల్లి పాత్రలు ఎక్కువ కూడా ఉండకూడదు అప్పుడు మన కధకి స్పష్టత ఉండదు.

చివరకి మన కధకి పేరుపెట్టాలి .మన కధా పేరు ఎలావుండాలంటే అది మన కథను చదవటానికి ఆసక్తి పెంచాలి. ఎలా కధాలు లేక కవితలు రాస్తారు. కధలు రాయటానికి కవితలు రాయటానికి చాలా తెడావుంది.

"కానీ ఇష్టపది కష్టపడితే అన్ని సాధ్యమే....."

ధన్యవాదాలు 

.    .    .

Discus